Falaknuma jilten sticks : పాతబస్తీ కేంద్రంగా పేలుడు పదార్ధాలు తయరు చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాట్టేపల్లిలో బొగ్గు డిపోలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పాతబస్తీలో పేలుడు పదార్థాల తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. కాగా, కరీంనగర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిటోనేటర్ పేలుడు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో డొంక కదిలింది. వెంటనే, కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు.
దీంతో పేలుడు పదార్ధాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి పెద్దమొత్తంలో డిటోనేటర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గన్‌పౌడర్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్న నజీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఫలక్‌నూమా పోలీసులకు అప్పగించారు. కాచిగూడ ఈద్ బజర్ కు చెందిన షబ్బీర్, నజీర్ 2018 వరకు లైసెన్స్ పొంది గన్‌పౌడర్ తయారు చేస్తున్నారు. తిరిగి మళ్లీ రెన్యువల్ కు దరఖాస్తు చేసుకోగా పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీంతో నిందితులు ఇదే ప్రాంతంలో అక్రమంగా పేలుడు పదార్ధాలు తయరు చేస్తు కరీంనగర్, ఖమ్మంలోని కొంతమంది వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. పాలిష్ పౌడర్ అని తప్పుడు పత్రాలు సృష్టించి గన్‌పౌడర్‌ను కరీంనగర్ కు ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ లో తరలిస్తున్నట్టు గుర్తించారు.
Read also : Attack on traffic police: పోలీసుల పై దాడులకు పాల్పడితే సహించేది లేదు: ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్