Honey trapping case: ఆంధ్రప్రదేశ్‌లో హాని ట్రాపింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్న కిలాడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చిత్తూరు (Chittoor) జిల్లాలో చోటుచేసుకుంది. హాని ట్రాపింగ్‌కు పాల్పడిన 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులంతా ఫేస్‌బుక్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లరి పిల్ల అనే ఫేస్ బుక్ ప్రొఫైల్‌తో పలువురికి వల వేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట అల్లరి పిల్ల ఐడీ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. ముఠా బాధితులతో పరిచయం పెంచుకుంటుంది.
ఆ తర్వాత ఫేస్‌బుక్ మెస్సెంజర్ ద్వారా చాటింగ్ చేసి.. యువతుల ద్వారా వీడియో కాల్స్ చేయిస్తారు. అయితే.. వీడియో కాల్స్ మాట్లాడడానికి ఐఎంఓ అప్లికేషన్ ఇన్ స్థాల్ చేసుకోమని ఒత్తిడి చేస్తారు. అలా ఐఎంఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసిన బాధితులతో యువతులు మాట్లాడినట్లు మాయ చేస్తారు. అనంతరం ఐయంఓ లిటిల్ అప్లికేషన్ ద్వారా మొబైల్ హ్యాక్ చేస్తారు. ఇలా చిత్తూరులో సీకే మౌనిక్ అనే యువకుడి బ్యాంక్ ఖాతా నుండి నుంచి దాదాపు 4 లక్షల రూపాయలు కాజేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు విశాఖపట్నం, వరంగల్, కడప జిల్లాలకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: