Kurnool Honey Trap Gang: సమాజంలో మోసాల తీరు మారుతోంది. మనుషుల బలహీనతలను, ఆసరా చేసుకుని, అమ్మాయిలను ఎరగా వేసి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో జరుగుతోన్న మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాము మోస పోయామనే విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని భావించి ఎవ్వరికీ చెప్పుకోని వారు కొందరరైతే ప్రాణాలు వదిలేస్తున్నారు. మరి కొందరు.. డబ్బులు, పరువు రెండూ కోల్పోతూ మానసకింగా కుమిలిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘనటే ఒకటి కర్నూలు జిల్లాలో జరిగింది.
ఓ యువతి వలపు మాటలకు పొంగిపోయిన ఓ యువకుడు, ఆమె ఏం చెబితే అది చేశాడు. చివరికి వివస్త్రను చేసి అర్థ నగ్న పోటోలు సైతం షేర్ చేశాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఫోటోలను అడ్డు పెట్టుకుని ఓ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. సదరు యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి దండుకున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లా పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో యువకులు మోస పోయినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా స్కెచ్ వేసిన పోలీసులు దోపిడీ ముఠాకు చెక్ పెట్టారు.
కర్నూలు నగరంలో హనీ ట్రాప్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న వ్యవహారానికి పోలీసులు చెక్ పెట్టారు. ఐదుగురు సభ్యులు కలిగిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 2 ప్రాంసరి నోట్లు, రూ.4 లక్షలు విలువైన 2 చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also…. Telangana Schools Reopen: తెలంగాణ పాఠశాలలు పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రీ-ఓపెన్ ఎప్పటి నుంచంటే..?
Viral Video: పొలంలో 5 అడుగుల భారీ నాగుపాము.. భయంతో పరుగులు పెట్టిన రైతులు..