Maharastra Crime: హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికపై అత్యాచారం… మహారాష్ట్ర లాతూర్‌లో దారుణం

మహారాష్ట్ర లాతూర్‌లో దారుణం జరిగింది. హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికపై అత్యాచారం చేశారు దుండగులు. లాతూర్ జిల్లాలోని ఔసా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాతూర్‌ HIV బాధితుల షెల్టర్‌లో రెండేళ్లుగా ఉంటోంది బాలిక. లైంగిక దాడితో.. బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం గుట్టు...

Maharastra Crime: హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికపై అత్యాచారం... మహారాష్ట్ర లాతూర్‌లో దారుణం
Minor Girl Rape

Updated on: Jul 26, 2025 | 8:36 AM

మహారాష్ట్ర లాతూర్‌లో దారుణం జరిగింది. హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికపై అత్యాచారం చేశారు దుండగులు. లాతూర్ జిల్లాలోని ఔసా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాతూర్‌ HIV బాధితుల షెల్టర్‌లో రెండేళ్లుగా ఉంటోంది బాలిక. లైంగిక దాడితో.. బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం గుట్టు చప్పుడుకాకుండా అబార్షన్ చేయించారు. నిందితులకు HIV బాధితుల షెల్టర్‌ నిర్వాహకులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో.. ధోకి పోలీస్ స్టేషన్‌లో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాధిత బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ధరాశివ్ జిల్లాలోని ధోకికి చెందిన బాలిక హెచ్‌ఐవితో బాధపడుతూ ఓ ఆశ్రమంలో ఉంటోంది. రెండు సంవత్సరాలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 13, 2023 నుంచి ఈ సంవత్సరం జూలై 23 మధ్య లాతూర్‌లోని హసేగావ్‌లోని హెచ్‌ఐవి సోకిన పిల్లల గృహం సేవాలయ్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని అధికారి తెలిపారు.

బాలికల సేవాగృహంలోని ఒక ఉద్యోగి ఆమెపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని అతను ఆమెను బెదిరించాడు. సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తనపై జరిగిన అఘాయిత్యంపై లేఖ రాసి పోలీసుల ఫిర్యాదుబాక్సులో వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక అనారోగ్యానికి గురై ఆసుపత్రికి తరలించిన తర్వాత, పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. ఆ తర్వాత నిందితుడు ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయించడానికి ఏర్పాట్లు చేశాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.

సంస్థ వ్యవస్థాపకుడు మరియు సూపరింటెండెంట్, ఆమెపై అత్యాచారం చేసిన ఉద్యోగి మరియు గర్భస్రావం చేసిన వైద్యుడిపై ధోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టియిన వారిలో వసతి గృహం వ్యవస్థాపకుడు రవి బాపట్లే, దాని సూపరింటెండెంట్ రచనా బాపట్లే, ఉద్యోగులు అమిత్ మహాముని మరియు పూజా వాఘ్మారే ఉన్నారు.