Andhra Pradesh: అయ్యో పాపం యాక్సిడెంట్ అనుకోకండి… అస‌లు విష‌యం తెలిస్తే మైండ్ బ్లాంక్

|

Nov 04, 2021 | 10:08 AM

గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు తెగబ‌డుతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే ఝ‌ల‌క్ ఇస్తున్నారు.

Andhra Pradesh: అయ్యో పాపం యాక్సిడెంట్ అనుకోకండి... అస‌లు విష‌యం తెలిస్తే మైండ్ బ్లాంక్
Ganja Seized
Follow us on

గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు తెగబ‌డుతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే ఝ‌ల‌క్ ఇస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆహార పదార్థాల మాటున.. పండ్ల లోడు మాటున.. పాల వ్యాన్లు లోపల… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రూపంలో గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన చాలామంది స్మగ్లర్లు.. పోలీసులకు చిక్కారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ కీలాడి స్మగ్లింగ్ ముఠా బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ముఠా వ్యవహరించిన తీరు పోలీసులను విస్మయానికి గురిచేసింది. గోదావ‌రి జిల్లాల్లో విరివిగా ల‌భించే కొబ్బరికాయల లోడు మాటున ఈ ముఠా గంజాయిని స్మగ్లింగ్ చేయడం కలకలం రేపింది.

ఎటపాక మండలం నెల్లిపాక వద్ద కొబ్బరికాయల లోడ్ మాటున గంజాయి తరలిస్తూ వ్యాన్ ప‌ట్టుబ‌డింది.
నెల్లిపాక వద్ద పోలీస్ చెక్ పోస్ట్ చూసి బారికేడర్లను ఢీకొట్టుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశారు స్మ‌గ్ల‌ర్లు. ఈ క్ర‌మంలో అదుపుత‌ప్పిన వాహ‌నం కాలువలోకి దూసుకెళ్లింది. పోలీసులు వాహ‌నాన్ని బ‌య‌ట‌కు తీసి.. స్టేష‌న్ కు త‌ర‌లించారు. వ్యాన్ లో భారీగా గంజాయి పట్టుబడటం పోలీసులను షాక్‌కు గురిచేసింది. కాగా గంజాయి సాగు, అక్ర‌మ ర‌వాణాను నిరోధించేందుకు ఏపీ స‌ర్కార్ రాష్ట్ర‌వ్యాప్తంగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే.

Also Read:  పెళ్లి చూపుల్లో అబ్బాయి న‌చ్చ‌లేద‌ని చెప్పిన యువ‌తి.. అత‌డు చేసిన ప‌ని క‌నీసం మీరు ఊహించ‌లేరు