హథీరాంజీ మఠంలో బంగారు, వెండి వస్తువులకు రెక్కలు

|

Jul 10, 2020 | 10:23 AM

అశ్రమంలోని అభరణాలకు రక్షణ కరువైంది. మాయమైన బంగారు, వెండి వస్తువులు పాపం నీదంటే నీదంటూ సిబ్బంది ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల హథీరాంజీ మఠంలో మరోసారి కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హథీరాంజీ మఠంలో బంగారు, వెండి వస్తువులకు రెక్కలు
Follow us on

అశ్రమంలోని అభరణాలకు రక్షణ కరువైంది. మాయమైన బంగారు, వెండి వస్తువులు పాపం నీదంటే నీదంటూ సిబ్బంది ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల హథీరాంజీ మఠంలో మరోసారి కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హథీరాంజీ మఠంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న గుర్రప్ప అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో మఠం అధికారులు అందరి సమక్షంలో బీరువా తెరచి లెక్కలు పరిశీలించారు. అందులో 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయని తేల్చారు. మాయమైన వస్తువులకు మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. విలువైన వస్తువులు అదృశ్యంపై మఠం అధికారులు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు మఠంలో మిస్ అయిన వస్తువుల తాలుకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.