Loan APPs: రక్తం తాగుతున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు.. ‘అమ్మ’ ఫొటోను పోర్న్ సైట్‌లో పెడతామంటూ..

|

May 24, 2022 | 8:16 AM

తీసుకున్న అప్పు మొత్తం తీర్చేసినా, లోన్‌ క్లియర్‌ కాలేదంటూ వేధింపులకు దిగారు కేటుగాళ్లు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ సైట్లలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు.

Loan APPs: రక్తం తాగుతున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు.. ‘అమ్మ’ ఫొటోను పోర్న్ సైట్‌లో పెడతామంటూ..
Loan app
Follow us on

Online loan app harassment: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ఆగడాలు ఆగడం లేదు. జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. తెలంగాణలో మరో బెదిరింపుల పర్వం బయటపడింది. తీసుకున్న అప్పు తీర్చేసినా వేధింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఖమ్మం జిల్లా మధిర (Madhira) లో మరో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ అరాచకం బయటికొచ్చింది. తీసుకున్న అప్పు మొత్తం తీర్చేసినా, లోన్‌ క్లియర్‌ కాలేదంటూ వేధింపులకు దిగారు కేటుగాళ్లు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ సైట్లలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు.

ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన ప్రదీప్‌, అత్యవసరమై, ఆన్‌లైన్‌ యాప్‌లో ముందు 5వేలు, ఆ తర్వాత 3500 రూపాయలు లోన్‌ తీసుకున్నాడు. తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాడు. ఆ తర్వాతే అసలు, కథ మొదలైంది. మీ లోన్‌ ఇంకా క్లియర్‌ కాలేదంటూ పదేపదే బెదిరింపు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రదీప్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న అందరికీ ప్రదీప్‌.. చీటర్, రేపిస్ట్‌ అంటూ మెసేజ్‌లు పంపారు.

చివరికి, ప్రదీప్‌ తల్లి ఫొటోను మార్ఫింగ్‌చేసి పోర్న్‌ సైట్‌ పెడతానని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మానసిక క్షోభకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..