Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్

కళామతల్లి ఖిల్లా విజయనగరం జిల్లాలో గుజరాతీ యువతులు హల్చల్ చేస్తున్నారు. పార్వతీపురం పట్టణంలోని ఒక లాడ్జిలో మకాం వేసి ఊర్లలో కలకలం రేపుతున్నారు...

Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్
Ladies

Updated on: Jul 25, 2021 | 3:50 PM

Gujarati Ladies – Parvathipuram : కళామతల్లి ఖిల్లా విజయనగరం జిల్లాలో గుజరాతీ యువతులు హల్చల్ చేస్తున్నారు. పార్వతీపురం పట్టణంలోని ఒక లాడ్జిలో మకాం వేసి ఊర్లలో కలకలం రేపుతున్నారు. రోడ్డుపై వాహనదారులను అపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివే పలు ఉదంతాలు, ఆరోపణలు వస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించి విచారించారు.

వీరంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. పార్వతీపురం పట్టణంలో ఒక లాడ్జిలో మహిళలు మకాం వేశారని, మొత్తం 24 మంది మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేశామని పోలీసులు చెప్పారు.

కాగా, ఇటీవల తెలంగాణ జిల్లా నిజామాబాద్‌లోనూ ఇదే విధంగా మహిళలు రోడ్డు మీద వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. గుజరాత్ నుంచి మర్ యువతుల ముఠాలు అన్ని జిల్లాలకు పాకిపోయారు. అటు, హైదరాబాద్ బీబీనగర్ దగ్గర కూడా రీసెంట్ గా ఇలాంటి ముఠాని పోలీసులు పట్టుకున్నారు.

Read also :  Godavari : ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రమాద స్థాయికి నీటిమట్టం