పిల్లలు అంగవైకల్యంతో పుట్టారని..ప్రభుత్వ టీచర్ నిర్వాకం

|

Oct 02, 2020 | 5:11 PM

పిల్లలు అంగవైకల్యంతో పుట్టారంటూ భార్య పిల్లలను నడిరోడ్డు పై వదిలేశాడు ఓ చదువుకున్న మూర్ఖుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లో చోటు చేసుకుంది‌.

పిల్లలు అంగవైకల్యంతో పుట్టారని..ప్రభుత్వ టీచర్ నిర్వాకం
Follow us on

పిల్లలు అంగవైకల్యంతో పుట్టారంటూ భార్య పిల్లలను నడిరోడ్డు పై వదిలేశాడు ఓ చదువుకున్న మూర్ఖుడు. కట్టుకున్న భార్యను కాదని మరో మహిళతో అక్రమసంబందం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలాంటి నీచానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లో చోటు చేసుకుంది‌.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన బిల్లా తిరుపతయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. పదిహేను ఏళ్ల క్రితం అతడికి వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వారిద్దరూ కూడా అంగవైకల్యంతో పుట్టడంతో వారిని పోషించలేనంటూ భార్యను తల్లిగారింటి వద్ద వదిలేసి వచ్చాడు. అప్పడి నుండి ఒంటరిగా ఉంటున్నాడు. అయితే తాజాగా తిరుపతయ్య చెన్నూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్రమసంబందం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న భార్య .. తన ఇద్దరి పిల్లలతో కలిసి ప్రియురాలి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

ఐదేళ్లు , 15 ఏళ్ల ఇద్దరు మగ పిల్లలు అంగ వైకల్యంతో ఉన్నారని.. తనను అన్యాయం చేసి ఇలా అక్రమసంబందం కొనసాగిస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ ఆందోళకు దిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా చేయడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది బాదితురాలు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలికి నచ్చ చెప్పి ఆందోళన విరమింపజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తిరుపతయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.