Gold Seized: ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. కటకటాల పాలయ్యాడు.. ఢిల్లీ విమానాశ్రయంలో..

|

Mar 16, 2022 | 2:05 PM

Gold Seized at Delhi airport: బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో సరికొత్త ప్లాన్‌లతో బంగారాన్ని

Gold Seized: ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. కటకటాల పాలయ్యాడు.. ఢిల్లీ విమానాశ్రయంలో..
Gold Seized
Follow us on

Gold Seized at Delhi airport: బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో సరికొత్త ప్లాన్‌లతో బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తూ చిక్కుతున్నారు. ఇటీవల స్మగ్లర్లు (gold smuggling) శరీర భాగాల్లో సైతం బంగారాన్ని దాచుకొని తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ప్రయాణికుడి నుంచి సుమారు రూ.49 లక్షల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు.. దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడి స్మగ్లింగ్ వ్యవహారం చూసి అధికారులే విస్తుపోయారు. విమానంలో పూర్తిగా తనిఖీలు చేసిన అధికారులు. ప్రయాణికుడి సీటు కింద సిల్వర్ టేప్‌తో అమర్చి ‘U’ ఆకారపు బంగారం కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిని ప్రయాణికుడు సీటు కింద ఉన్న రాడ్‌లో అమర్చి తీసుకువచ్చాడు. అయితే.. ఈ ప్లాన్‌‌ను పసిగట్టిన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కేజీ బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని దీని విలువ రూ. 48,90,270 ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అవ్వగానే తనిఖీలు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేరాన్ని నిందితుడు సైతం అంగీకరించాడు. కాగా.. అంతకుముందు కూడా రెండు కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు ప్రయాణికుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Also Read:

AP News: ఏపీలో నకిలీ థైరాయిడ్ మందుల కలకలం.. అనుమానం రాకుండా దందా.. చివరకు

Viral Video: కచా బాదం సాంగ్‌కు మహిళ డ్యాన్స్‌ అదుర్స్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌