Girl suspicious Death: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. రాత్రి 9 గంటల సమయంలో అదృశ్యమైన బాలిక.. అపార్ట్‌మెంట్ కింద శవమై కనిపించింది. ఈ ఘటన నగరం పరిధిలోని అగనంపూడి శనివాడలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు శనివాడలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద బాలిక అదృశ్యమైంది. అనంతరం బాలిక కోసం కుటుంబీకులు, స్థానికులు వెతుకుతుండగా పక్క అపార్ట్‌మెంట్ వద్ద బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అయితే బాలిక తల్లిదండ్రులు పక్క అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖపట్నానికి వచ్చింది. అనంతరం దంపతులు అగనంపూడిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిలో చేరారు. వారికి 13ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె 8వ తరగతి చదువుతోంది. అయితే.. నిన్న రాత్రి అదృశ్యమైన బాలిక పక్క అపార్ట్‌మెంట్ కింద విగతజీవిగా కనిపించింది. అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడి అనుమానస్పదస్థితిలో మృతి చెందిఉంది. బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆమెను ఎవరో హత్య చేసి పడేసినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహంతో అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూర్మన్నపాలెం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: