
కరోనా వైరస్ సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు కట్టే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదు. దీంతో తన ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి తనువు చాలించింది ఓ యువతి. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్ను ఆదేశించింది. షకీల్ డబ్బు తీసుకురాలేకపోయాడు. తన కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి మనస్థాపంతో ఆ యువతి ఇంట్లోనే ఉరి వేసుకుంది. మెహెక్ను 4, 6 తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి (19) ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.