ఏసీబీ వలకు చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి.. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్‌ పూల్‌సింగ్‌

|

Feb 23, 2021 | 6:53 PM

హైదరాబాద్ పాతబస్తీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా..

ఏసీబీ వలకు చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి.. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్‌ పూల్‌సింగ్‌
Follow us on

హైదరాబాద్ పాతబస్తీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సుపెరిండెంట్ పూల్ సింగ్. పాతబస్తీ నర్కి పూల్ బాగ్ లోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే.. ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వం తరఫున కర్మకాండ కొరకు రూ.20 వేలు అందిస్తుంది. అయితే ఓ బాధితుడికి రూ.20 వేలు అందించే క్రమంలో రూ.10 వెలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ నీ ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇంజినీర్ పూల్ సింగ్ (circle no 10 ghmc)ఆఫీస్ లో రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకొన్నారు.

జీహెచ్‌ఎంసీ కార్మికుడు ఆశయ్య చనిపోవటంతో అతని భార్య బాలమ్మకు పెన్షన్ వస్తుంది. గత నెల బాలమ్మ కూడా చనిపోయింది. ఆమె కొడుకు క్రాంతి అంత్యక్రియల నిమిత్తం రూ. 20 వేలు వస్తాయని తెలిసి నర్కిపూల్ బాగ్ లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ పూల్ సింగ్ ని ఆశ్రయించారు. రూ. 20 వేలు కావాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ను ఆశ్రయించగా ఈ రోజు రూ5వేలు పూల్ సింగ్ కు బాధితుడు ఇస్తుండగా పట్టుకొన్నారు.

Read more:

పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు