Haryana Police Molested Girls: రక్షక భటులే భక్షక భటులయ్యారు. కాపాలా ఉండాల్సిన వారే కామాంధులుగా మారారు. హర్యానా రాష్ట్రంలో ఈ దారుణం వెలుగుచూసింది. రేవారిలో దారుణమైన ఉదంతానికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులే.. ఇద్దరు యువతుల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత గురువారం నవంబరు25న కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర, అతని మిత్రుడు ధర్మేంద్ర స్థానికంగా ఉన్న స్పా మసాజ్ సెంటర్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులపై అనుచితంగా ప్రవర్తిస్తూ.. దుర్బాషలాడారు. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వారి వాహనంలో తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని ఒక హోటల్‌కు తరలించారు. ముగ్గురు పోలీసులు కలిసి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్పాసెంటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.