నాగర్ కర్నూల్ జిల్లా- కల్వకుర్తికి చెందిన పందొమ్మిదేళ్ల యువతి హైదరాబాద్ లో ఉంటూ ఒక ప్రైవేటు జాబు చేస్తోంది. ఇంతలో ఆమెకు శ్రీకాంత్ డాన్ అనే ఒకడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. రెండు మూడు నెలలుగా వీరి పరిచయం స్నేహంగా మారింది. అది మరింత బలపడుతున్న సమయంలో.. ఆమెకు అనుకోకుండా ఒక ఆర్ధిక అవసరం వచ్చింది. దీంతో తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ శ్రీకాంత్ కు 30 వేల రూపాయలు అవసరముందంటూ.. రిక్వెస్ట్ పెట్టింది.
ఇదే అదనుగా భావించిన మన డాన్ శ్రీకాంత్.. డబ్బు కావాలంటే ఆమన్ గల్ కు రావాలని చెప్పాడు. ఆమెకు డబ్బు ఎంత అత్యవసరమో తెలీదు. కానీ ఎట్టకేలకు అతడు చెప్పిన చోటకైతే వచ్చిందామె. అప్పటికే పెద్ద స్కెచ్ వేసిన అతడు తన ఇద్దరు మిత్రులు గణేష్, నిఖిల్ ను సైతం ఒక రెంట్ కార్ లో వెంటబెట్టుకుని వచ్చాడు. ఏటీఎంలో డబ్బులు తీసుకుందాం కారెక్కమని అన్నాడు. ఆమె కూడా వారు చెప్పినట్టే చేసింది. ఏటీఎంలలో డబ్బులు లేవంటూ మభ్య పెడుతూ.. ఆమన్ గల్ టూ కల్వకుర్తి అక్కడి నుంచి మిడ్జిల్ ఇలా అన్ని ఊళ్లూ తిప్పారు. ఆమెకు అనుమానమొచ్చింది. దీంతో ఎవరో ఫ్రెండ్ కి ఫోన్ చేయడం గుర్తించిన వాళ్లు.. ఆమెను అడ్డుకున్నారు. తర్వాత ఆమె ఒంటి మీద ఎక్కడంటే అక్కడ చేతులేస్తూ.. అసభ్యంగా వ్యవహరించారు. ఈలోగా ఊరుకోండ గేట్ దగ్గర పోలీస్ చెకింగ్ జరుగుతుండగా.. ఆమెకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. రక్షించండీ.. రక్షించండీ అంటూ కేకలు వేసింది.. ఆమె అరుపులకు అలెర్టయిన పోలీసులు.. వెంటనే యాక్షన్ లోకి దిగారు. ఆమెను ఆ దుండగుల నుంచి కాపాడారు.
ఆమె అదృష్టం బాగుండి.. పోలీసు చెకింగ్ ఎదురు పడ్డంతో సరిపోయింది. కానీ లేకుంటే పరిస్థితి ఏంటి? దిశ ఘటనలోనూ సరిగ్గా ఇలాంటి కొందరు యువకులు సాయం పేరిట ఆమెను మభ్య పెట్టడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. వీళ్లు కూడా ఇంచుమించు ఇలాంటి వ్యవహారశైలితోనే ఉన్నట్టు కనిపించింది. అందుకే ఈ సోషల్ మీడియా స్నేహాలను అంత తేలిగ్గా నమ్మరాదని పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. కాబట్టి తస్మార్ట్ జాగ్రత్త!
Also Read: కూతురు వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు.. పెద్దలు మందలించారు.. కట్ చేస్తే