Road Accident: జహీరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం.. అసలేమైందంటే..

Zaheerabad Road Accident: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్‌ మండలంలో డిడిగి వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొని

Road Accident: జహీరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం.. అసలేమైందంటే..
Road Accident

Updated on: Jan 01, 2022 | 4:07 PM

Zaheerabad Road Accident: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్‌ మండలంలో డిడిగి వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతులు, 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బైకుపై వెళ్తున్న దంపతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు (28), శ్రావణి (22), చిన్నారి అమ్ములు (8 నెలలు)గా పోలీసులు గుర్తించారు. కారులో మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25) గా గుర్తించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

జహీరాబాద్-బీదర్ రహదారిపై కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Haryana Landslide: ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద 20 మంది కూలీలు!

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరొకరు బలి.. సైకిల్‌పై వెళుతుండగా దూసుకొచ్చిన మృత్యువు