Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చనిపోయిన గేదెపైకి ఎక్కిన ఆటో..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో.. రోడ్డుపై చనిపోయిన..

Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చనిపోయిన గేదెపైకి ఎక్కిన ఆటో..
Road Accident

Updated on: Aug 30, 2021 | 1:01 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి ఎక్కింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం రోలుగుంపాడు సమీపంలో ప్యాసింజర్లతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి ఎక్కింది.

దాంతో అదుపు తప్పి ఆట ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆటోలో పద్నాలుగు మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

OU: ఉస్మానియా హాస్టల్స్ దగ్గర మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ మోతే శ్రీలత ‘చాయ్ పే చర్చ’