పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం

|

Jul 23, 2021 | 10:12 AM

పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు.

పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం
Road Accident In Punjab
Follow us on

Road Accident in Punjab: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోగా పట్టణ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల బస్సును ఎదురుగా వస్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వేగంగా వచ్చిన రెండు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడిక్కడే చనిపోయారు. వీరితో పాటు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించారు. దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు మరణించడంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ఇవాళ మధ్యాహ్నం పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్దూ బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినప్పటికీ.. నవజోత్ సింగ్ సిద్దూకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను సోనియా గాంధీ అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. సిద్దూతో పాటు మరో నలుగురిరి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జులై 18న ఉత్తర్వులు వెలువరించారు. ఇక సంగట్ సింగ్ గిల్జియాన్, సుఖ్విందర్ సిండ్ డానీ, పవన్ గోయెల్, కుల్జిత్ సింగ్ నగ్రాను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పీసీపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు సిద్ధూ. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు.

Read Also…

Website Down: అమెజాన్, జొమాటోతో సహా 29 వేల వెబ్‌సైట్‌లు కొద్దిసేపు ఆగిపోయి..ప్రారంభం అయ్యాయి.. ఎందుకంటే..