Illicit Liquor: కాటేసిన కల్తీ మద్యం.. ఐదుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..

Consuming Illicit Liquor: ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు

Illicit Liquor: కాటేసిన కల్తీ మద్యం.. ఐదుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..
illicit liquor

Updated on: Apr 28, 2021 | 1:10 PM

Consuming Illicit Liquor: ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనారోగ్యం బారిన పడిన వారిన హత్రాస్ జిల్లా ఆసుపత్రి, అలీగఢ్ మెడికల్ కాలేజీలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన హత్రాస్ జిల్లాలోని నాగ్లా సింఘి గ్రామంలో జరిగింది. గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన పూజా కార్యక్రమం అనంతరం కొందరు నైవేద్యంగా సమర్పించిన మద్యాన్ని తాగారు. ఆ తర్వాత ఒక్కొక్కరి ఆరోగ్య క్షీణిస్తూ.. ఐదుగురు మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గ్రామానికి చేరకుకొని విచారణ చేపట్టారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు మద్యం విక్రేత రామ్‌హారీని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. స్థానిక సాస్ని మద్యం కాంట్రాక్టు నుంచి మద్యం విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని హత్రాస్ డీఎం రమేష్ రంజన్ వెల్లడించారు.

ఇదిఉంటే.. ఇటీవల కాలంలో యూపీలో కల్తీ మద్యం తాగి చాలామంది మరణిస్తున్నారు. జనవరిలో యూపీలోని బులంద్‌షహర్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించగా.. 12 మంది అనారోగ్యానికి గురయ్యారు.

Also Read:

Covid Tablets: కరోనా వ్యాక్సిన్‌కు బదులు టాబ్లెట్​.. ప్రయోగాలు ప్రారంభం.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే..

Assam Earthquake: అస్సాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో ఇల్లు.. షాకింగ్ వీడియో..