Fire Breaks at bank: హైదరాబాద్ నగరంలోని ఓ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. నగరంలోని కర్మాన్‌ఘాట్ బాలాగౌడ్ కాంప్లెక్స్‌లోని కెనరా బ్యాంకులో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. బ్యాంకు నుంచి పొగలు రావడం స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ.. బ్యాంకు షట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలను పగులగొట్టింది.
అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని.. ఫైర్ సిబ్బంది వెల్లడించారు. అనంతరం బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించిందా..? లేక మరెదేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: