Fire Accident: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాటన్ మిల్లులో ఎగిసిపడిన మంటలు..

Fire Accident in Rajendranagar: హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్

Fire Accident: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాటన్ మిల్లులో ఎగిసిపడిన మంటలు..
Fire Accident

Updated on: Nov 17, 2021 | 7:54 AM

Fire Accident in Rajendranagar: హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మైలారద్‌దేవ్ పల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో కాటన్ వేస్ట్ భారీగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. రెండు ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కాటన్ బెడ్, మెత్తలు తాయారు చేసే కంపెనీలో మంటలు ఒక్కసారిగా తీవ్రంగా వ్యాపించడంతో భయాందోళనకు గురి అయిన చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Attack on CBI: సీబీఐ బృందంపై స్థానికుల దాడి.. పోలీసులు అడ్డుకోకుంటే ఏమయ్యేదో.. ఏం జరిగిందంటే..

Puneeth-Vishal: అప్పు సేవలను కొనిసాగిస్తా.. ఇల్లు కంటే 1800 మంది విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమంటున్న హీరో విశాల్..