కన్నకొడుకును కొట్టి చంపిన తండ్రి
ప్రకాశంజిల్లా దొనకొండ మండలం బసిరెడ్డిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపాడో తండ్రి. అనంతరం బంధువుల సాయంతో కొడుకు మృతదేహాన్ని..
Father kills own son: ప్రకాశంజిల్లా దొనకొండ మండలం బసిరెడ్డిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపాడో తండ్రి. అనంతరం బంధువుల సాయంతో కొడుకు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో తగులబెట్టాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కన్నెబోయిన చినసుబ్బయ్య తన పెద్ద కొడుకు రమేష్‌తో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. చినసుబ్బయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నేపధ్యంలో గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. అయితే రాత్రి తండ్రీకొడుకులిద్దరు మద్యం సేవించారు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో రమేష్ తన తండ్రి చినసుబ్బయ్యను కొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో చిన్నసుబ్బయ్య ఇటుకరాయితో తన పెద్దకొడుకు రమేష్ తలపై కొట్టాడు. అనంతరం కర్రతో విచక్షణారహితంగా కొట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన రమేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ఈ వ్యవహారం బయటకు తెలిస్తే చినసుబ్బయ్యను పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో బంధువులు, మిగిలిన ఇద్దరు కొడుకులు కలిసి రమేష్ మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామశివారులోని స్మశానంలో రమేష్ మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ విషయం బయటకు పొక్కి పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో గ్రామ కార్యదర్శి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: మద్యం ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్
Also read: ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్
Also read: చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త
Also read: 9 రోజుల్లో కోటికి పైగా కరోనా పరీక్షలు
Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే
Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా
Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్