Fake Gold: రూ.7లక్షలకే మూడు కిలోల బంగారం.. అప్పు చేసి మరీ కొనుగోలు చేసిన రైతు.. తీరా ఇంటికెళ్లి చూస్తే..!

|

Aug 22, 2021 | 5:28 PM

నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇటీవల కాలంలో మాయమాటలతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేటుగాళ్లు మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకుని రూ.లక్షలు దోచుకుంటున్నారు.

Fake Gold: రూ.7లక్షలకే మూడు కిలోల బంగారం.. అప్పు చేసి మరీ కొనుగోలు చేసిన రైతు.. తీరా ఇంటికెళ్లి చూస్తే..!
Fake Gold
Follow us on

Fake Gold: నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇటీవల కాలంలో మాయమాటలతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేటుగాళ్లు మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకుని రూ.లక్షలు దోచుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని పోలీసులు ఎంత చెప్పినా.. అత్యాశకు పోయి ఉన్న సొమ్మును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజా నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. మూడు కేజీల బంగారం కేవలం రూ. 7లక్షలకే ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ వ్యక్తి.. నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించాడు. జిల్లాలోని వల్లాలలో జరిగిన ఈ ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన చెరుకు శ్రీను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కర్ణాటక నుంచి బతుకుదెరువు కోసం వచ్చి వల్లాల శివారులో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న బుట్టి అనే వ్యక్తితో పరిచయయ్యాడు. ఇదే క్రమంలోనే తనకు తెలిసిన వారి దగ్గర మూడు కిలోల పాత బంగారం ఉందని శ్రీనును అతడు నమ్మించాడు. దాన్ని రూ.7 లక్షలకే ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో శ్రీను బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ బుట్టికి రూ.7 లక్షల నగదు ఇచ్చాడు.

దురాశకు గురైన శ్రీను ఏడు లక్షల రూపాయలను అప్పు తెచ్చి మూడు కిలోల బంగారు కొనుగోలు చేశాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గ్రామం నుంచి చెప్పా పెట్టకుండా ఉడాయించాడు. దీంతో శ్రీను ఇంటికెళ్లి మూటను విప్పి చూడగా కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వాటిని స్థానికంగా ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లగా అదంగా నకిలీ బంగారమని తేలింది. తనను మోసం చేసిన బుట్టిని ఎలాగైనా పట్టుకోవాలని మూడు నెలలుగా శ్రీను చుట్టుపక్కల ప్రాంతాలు వెతికాడు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Dengue: విశాఖ, చిత్తూరు జిల్లా సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభణ, గ్రామాలకు గ్రామాలే మంచాన పడుతోన్న వైనం