Fake Doctor: వరంగల్‌లో మరో ‘శంకర్‌దాదా’.. డాక్టర్‌ అవతారమెత్తిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌.. యూట్యూబ్‌ చూస్తూ..

|

Mar 26, 2021 | 7:12 AM

Fake Doctor In Warangal: 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమాలో వైద్య విద్య పూర్తి చేయకపోయినా ప్రాక్టీస్‌ మొదలు పెట్టి పేషెంట్స్‌కు చికిత్స అందిస్తాడు హీరో. అది సినిమా కాబట్టి నవ్వులు పూయించింది. కానీ నిజ జీవితంలో..

Fake Doctor: వరంగల్‌లో మరో శంకర్‌దాదా.. డాక్టర్‌ అవతారమెత్తిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌.. యూట్యూబ్‌ చూస్తూ..
Fake Doctor In Warangal
Follow us on

Fake Doctor In Warangal: ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో వైద్య విద్య పూర్తి చేయకపోయినా ప్రాక్టీస్‌ మొదలు పెట్టి పేషెంట్స్‌కు చికిత్స అందిస్తాడు హీరో. అది సినిమా కాబట్టి నవ్వులు పూయించింది. కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటి శంకర్‌దాదాలు ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కేసు ఎక్కడో ఒక దగ్గర వెలుగు చూస్తునే ఉంది. ఇటీవలే ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇలాంటి నిర్వాకమే వెలుగు చూసింది. అయితే ఇది మరిచిపోకముందే వరంగల్‌లో ఇలాంటి మరో సంఘటనే వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి (38) ఒక మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. చదివింది బీఎస్సీ.. కానీ తాను ఓ ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అవతారమెత్తాడు. వరంగల్‌ పట్టణం నడిబొడ్డున ఆసుపత్రి ఏర్పాటు చేసి ఏకంగా సర్జరీలు చేసేస్తున్నాడు. యూట్యూబ్‌లో చూస్తూ వచ్చీ రానీ వైద్యంతో అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా ఉన్న సిటీ హాస్పిటల్‌లో ఈ తతంగం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయం తెలియడంతో బుధవారం అర్ధరాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడి చేసే పోలీసులకు అప్పగించారు. రెండోసారి ఆడపిల్లలు వద్దుకునే మహిళలను టార్గెట్‌గా చేసుకున్న ఇంద్రారెడ్డి.. వారిని ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తించి, నర్సింగ్‌లో శిక్షణ పొందిన వారి సాయంతో యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడి చేశారు. అధికారులను చూసిన వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. పోలీసుల సహాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చిన అధికారులు ఆమెను విచారించారు. తీవ్రరక్తస్రావం అవుతుండడంతో సదరు మహిళను హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇంద్రారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంద్రారెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. అధికారులు దాన్ని సీజ్‌ చేశారు.

Also Read: Petrol And Diesel Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. శుక్రవారం రేట్ ఎలా ఉందంటే..

Amazon Fab Phone Fest: అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ పేరుతో బంపర్ ఆఫర్స్.. అతి తక్కువ ధరలకే వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఐ ఫోన్స్..

Bharat Bandh: భారత్ బంద్‌కు మా మద్దతు.. ఆడియో టేపును విడుదల చేసిన మావోయిస్టులు