Hyderabad: సర్ప దోష నివారణ అంటూ.. రూ. 37 లక్షలు స్వాహా చేసిన కిలాడీలు..

|

Jul 06, 2022 | 9:50 PM

సర్పదోషం ఉందని భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని ట్రాప్‌ చేశారు. విడదల వారీగా 37లక్షల రూపాయలు వసూల్‌ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముఠా సభ్యులు పూజలు చేయకపోయినా..

Hyderabad: సర్ప దోష నివారణ అంటూ.. రూ. 37 లక్షలు స్వాహా చేసిన కిలాడీలు..
Fake Baba
Follow us on

మంత్రాలకు చింతకాయలు రాలవుగాక రాలవు. కానీ, చిక్కుల్లో ఉన్న వాళ్లు జాతకాలే దిక్కని భావిస్తుంటారు. కష్టాల నుంచి గట్టేక్కే దారేది అని కలత చెందేవాళ్లను న్యాక్‌గా బురిడీ కొట్టిస్తారు కేటుగాళ్లు. గ్రహ దోషాలు.. కాలసర్పదోషం ఉందంటూ ఉదరగొడుతారు. చేతబడి, జాతకాల పేరిట కొందరు దగా.. మంత్ర తంత్రాల పేరిట మరికొందరి మాయాజాలం.. వేషాలేవైనా నిలువు దోపిడీనే బురిడీగాళ్ల మనీ మంత్రంగా నిలుస్తుంది. దొంగతనం చేయడం అంటే ఆషామాషీ కాదు. స్కెచ్చేయాలి.. నిఘా పెట్టాలి.. అదను చూసి చోరీలకు పాల్పడాలి.. తేడా వస్తే చిప్పకూడే.. ఎందుకొచ్చిన లొల్లి అనుకున్న ఓ దొంగల బ్యాచ్‌.. ఖతర్నాక్‌ ఐడియా వేశారు. బాబా అవతారమెత్తితే చాలు వద్దంటే డబ్బే డబ్బని రూట్‌ మార్చారు. సర్ప దోష నివారణ మార్గం చూపిస్తామని చెప్పి ఓ వ్యాపారిని నిలువు దోచేశారు. బాబాలుగా మారిన ఆ దొంగల బ్యాచ్‌‌ను రాచకొండ పోలీసుల అరెస్ట్ చేశారు.

సర్పదోషం ఉందని భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని ట్రాప్‌ చేశారు. విడదల వారీగా 37లక్షల రూపాయలు వసూల్‌ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముఠా సభ్యులు పూజలు చేయకపోయినా.. మధ్యలో ఆపేసినా ప్రాణాలు పోతాయని భయపెట్టి డబ్బును దండుకున్నారు. దోచేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్పెషల్‌ టీమ్స్‌.. తెలంగాణ పోలీసు తడాఖా ఏంటో చూపారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేసి 8లక్షల రూపాయలు రికవరీ చేశారు.