Faction Murder: కడప జిల్లాలో మరోసారి భగ్గుమన్న పాతకక్షలు.. గ్రామ సర్పంచ్‌ను వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు..!

కడప జిల్లా జిల్లాలో వర్గపోరు భగ్గుమంది. రక్తం చిందింది. ఏకంగా ఓ ప్రాణాన్నే తీసింది. పట్టపగలు ఓ వ్యక్తి అతి కిరాతకంగా హతమార్చారు .

Faction Murder: కడప జిల్లాలో మరోసారి భగ్గుమన్న పాతకక్షలు..  గ్రామ సర్పంచ్‌ను వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు..!
Kadapa Faction Murder

Updated on: Jul 27, 2021 | 5:04 PM

Sarpanch Brutal Murder in Kadapa district: కడప జిల్లా జిల్లాలో వర్గపోరు భగ్గుమంది. రక్తం చిందింది. ఏకంగా ఓ ప్రాణాన్నే తీసింది. పట్టపగలు ఓ వ్యక్తి అతి కిరాతకంగా హతమార్చారు దుండగులు. సీఎం వైఎస్ జగన్‌ సొంత నియోజకవర్గంలోనే వైసీపీలో ఫ్యాక్షన్‌ పగలు భగ్గుమన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో మరోసారి పాతకక్షలకు ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయారు. కోమన్నూతల గ్రామం సర్పంచ్ చిన్నమునెప్పను ప్రత్యర్థులు దాడి చేసి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు.

కోమన్నూతల గ్రామానికి చెందిన చిన్నమునెప్పను వ్యక్తిగత పనిమీద పులివెందులకు వెళ్లి తిరిగి వస్తుండగా.. దారికాచి వేటకొడవళ్లతో ప్రత్యర్ధులు నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మునెప్పను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఏకంగా సర్పంచ్‌నే హత్య చేయడంతో.. గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఆధిపత్య పోరే హత్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ మునెప్ప అధికార పార్టీ కార్యకర్తగా యాక్టివ్‌గా ఉన్నారు. అదే పార్టీలో ఓ వర్గానికి అతని పట్ల అసంతృప్తి ఉంది. ఆ వర్గానికి చెందిన వారే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also…  Maharashtra Floods: మహారాష్ట్ర వరదల్లో 251 మందికి పైగా మృతి.. 100 మంది గల్లంతు.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్