Facebook Cheating: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం.. రూ.11 కోట్లు కొట్టేశారు

|

Aug 05, 2021 | 9:45 PM

ఫారెస్ట్ ఆయిల్ పేరుతో ఏకంగా రూ.11 కోట్ల సైబర్ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం చేసుకున్నారు...

Facebook Cheating: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం.. రూ.11 కోట్లు కొట్టేశారు
Facebook
Follow us on

Cyber Fraud: ఫారెస్ట్ ఆయిల్ పేరుతో ఏకంగా రూ.11 కోట్ల సైబర్ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం చేసుకున్నారు. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించారు. కరోనా వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని చెప్పి, విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్లు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.

ఆపై పత్తా లేకుండాపోయారు. దీంతో లబోదిబోమంటూ బాధితుడు డాక్టర్ మురళీమోహన్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.!

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాదిక్ గ్యాంగ్‌ పని పట్టారు రాచకొండ ఎస్వోటీ పోలీసులు. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ షేక్‌ సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 95 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీస్‌ సీజ్ చేశారు. 15లక్షల 70 వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28 క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సాదిక్‌ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్‌ అకౌంట్‌లను కూడా గుర్తించారు. ఈ అకౌంట్లలోని 69 లక్షల 63వేల నగదుని కూడా సీజ్ చేశారు

8 టీమ్, ఎమ్‌బి మ్యాక్స్, ఇన్‌ప్లే బెట్, యూఏఈ బెట్ వంటి యాప్‌ల ద్వారా ఈ ముఠా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. మొదట ఈ యాప్‌లకు సబ్‌స్క్రైబ్‌ చేసుకొని బుకీల నుంచి ఐడీలు, పాస్‌వర్డ్‌లు తీసుకుంటాడు సాదిక్. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఇంట్రెస్ట్ చూపుతున్న ఫంటర్స్‌ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. మ్యాచ్‌ జరిగే సమయంలో లింకులను ఫంటర్స్‌కు పంపి.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఆ తర్వాత నేరుగా ఆన్‌లైన్‌లో బుకీలతో బెట్టింగ్‌లు కాస్తుంటాడు.

ఫంటర్స్‌ బెట్టింగ్‌లో గెలిస్తే వారి నుంచి 30శాతం కమిషన్ కూడా తీసుకుంటున్నాడు సాదిక్. టాస్‌ విన్నింగ్‌ నుంచి మొదలు పెడితే, మ్యాచ్ ముగిసేవరకు బాల్‌ టు బాల్ బెట్టింగ్‌ ఉంటుంది. నిందితులు ఇలా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు రాచకొండ ఎస్వోటీ పోలీసులు. సాదిక్ నుంచి సేకరించిన కీలక సమాచారం ద్వారా ఎస్వోటీ పోలీసులు మరికొన్ని బెట్టింగ్‌ ముఠాలకు చెక్‌ పెట్టే పనిలో ఉన్నారు.

Read also: Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు