Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు భారీగానే జరుగుతున్నాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను ఆఫ్ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గ్యాస్ సిలిండర్, స్టైవ్‌లలో సమస్యలు ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. రాష్ట్రంలోని సేలం జిల్లాలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు కారణంగా మూడు ఇళ్లు కుప్పకూలిపోగా, ఒకరు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే కూలిపోయిన భవనాల శితిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల నుంచి ఐదుగురిని వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మందికి గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా భారీ ఎత్తున నష్టం జరుగుతోంది. ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సిబ్బంది, పోలీసులు అవగాహన కల్పి్స్తున్నారు. అయినా పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: