
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నారు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో నగర శివారులోని ఐడీఏ బొల్లారంలో ఉన్న PSN మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దాడులు చేశారు. భారీగా నిల్వ చేసిన రూ. 9కోట్ల విలువైన 90కేజీల మెపీడ్రిన్ ను అధికారులు సీజ్ చేశారు. కంపెనీ యజమానిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ పోల్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉంచినట్లు పక్కా సమాచారం అందడంతో PSN మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా నిల్వ చేసిన కెమికల్స్ తో తయారుచేసిన90కేజీల నిషేదిత మెపీడ్రిన్ డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టకున్నారు. దాదాపు దీని విలువ ఓపెన్ మార్కెట్ లో 9 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు యూరప్ దేశాలకు భారీ మొత్తంలో ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన 90.48 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ఆర్డర్ వీరికి డార్క్ వెబ్ ద్వారా వస్తున్నట్లు గుర్తించారు. బిట్ కాయిన్ రూపంలో ఈ ఆర్డర్ డ్రగ్స్ కు నగదులావాదేవీలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కొంతవరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై చేసిన్నట్లు సమాచారం.
కంపెనీలో 9 కోట్ల రూపాయల విలువైన 90.48 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. PSN మెడికేర్ లోనే 3-MMC డ్రగ్స్ ను తయారు చేసి.. యూరప్ కు ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా YLVO1 అనే కోడ్ నేమ్ తో తయారు చేస్తున్న పౌడర్ ను గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ కస్తూరి రెడ్డి నెమళ్లపూడిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ తయారు చేసి.. విదేశాలకు పంపుతున్న కస్తూర్ రెడ్డి.. విదేశీయులతో అనేక కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. PSN మెడికేర్ డైరెక్టర్ తో పాటు.. ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లను కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇప్పటి వరకు విదేశాలనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు రావటం చూశాము. కానీ ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లోనే ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకొని విదేశాలకు రవాణా చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. ప్రభుత్వం అధికారులు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…