Ex RSI arrested in Hyderabad: ఆయుధాలతో అక్రమ దందాకు తెరలేపిన మాజీ పోలీసు అధికారి ఆటకట్టించారు (hyderabad police) హైదరాబాద్ పోలీసులు. సస్పెండైన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అల్లం కిషన్‌రావు..కొద్దికాలంగా ల్యాండ్ సెటిల్‌మెంట్లకు తెరదీశాడు. ఈ క్రమంలోనే.. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని ల్యాండ్ వ్యవహారంలో తలదూర్చాడు. సెటిల్‌మెంట్ పేరుతో కరీంనగర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 39 లక్షలు వసూలు చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తుపాకులతో బెదిరింపులకు దిగాడు. బాధితుడు రెండ్రోజుల క్రితం జూబ్లీహిల్స్ (jubilee hills) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ పోలీసు అధికారి బండారం బయటపడింది.
బాధితుడు రియల్ వ్యాపారి అబ్బాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యూసుఫ్‌గూడా పోలీస్ బెటాలియన్‌లో నివసిస్తున్న కిషన్‌రావును అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి నాలుగు తుపాకులతోపాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో అబ్బాస్‌ను కిషన్‌రావుకు పరిచయం చేసిన లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ల్యాండ్ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న మాజీ పోలీసు అధికారి కిషన్‌రావు రియల్ వ్యాపారిని బెదిరించారన్నారు ఏసీపీ సుదర్శన్. స్థలవివాదం పరిష్కారానికి కరీంనగర్‌కు చెందిన అబ్బాస్ అనే రియల్ వ్యాపారి దగ్గర 39 లక్షలు తీసుకుని.. అతడిని బెదిరించాడన్నారు ఏసీపీ. గతంలోనూ కిషన్‌రావుపై కేసులున్నాయన్నారు ఏసీపీ.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. కిషన్‌రావు నుంచి రద్దైన నోట్లు, సిగరెట్ లైటర్‌ను వెలిగించే డమ్మి గన్‌ను కూడా సీజ్ చేశామన్నారు ఏసీపీ సుదర్శన్. పరారీలో ఉన్న లక్ష్మణ్ కోసం వెతుకుతున్నామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు.
Also Read: