Suicide: మనస్తాపంతో ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

| Edited By: Ravi Kiran

Aug 18, 2021 | 8:25 AM

Student Suicide: ఓ వైపు ప్రేమలో విఫలం కావడం.. మరోవైపు పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణాకి

Suicide: మనస్తాపంతో ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
Crime News
Follow us on

Student Suicide: ఓ వైపు ప్రేమలో విఫలం కావడం.. మరోవైపు పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లాలోని నందిగామలో చోటుచేసుకుంది. నందిగామ పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ (19) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలకావడం.. పరీక్షలల్లో మార్కులు సరిగ్గా రాకపోవడంతో అబ్ధుల్‌ షకిరాయా మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నందిగామ పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యుల నుంచి పలు వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. తల్లి ఫాతిమున్నిసా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు