IIT Madras Campus: తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కేరళకు చెందిన ఉన్ని కృష్ణన్ నాయర్ (30) ఐఐటీ మద్రాస్‌లో గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం ఉదయం కేరళ నుంచి క్యాంపస్‌కు చేరుకున్న కృష్ణన్ హాకీ గ్రౌండ్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెక్చరర్ మృతదేహాన్ని గమనించిన స్పోర్ట్స్ అధికారి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. కృష్ణన్ నాయర్ రూం నుంచి 11 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలోని రూంలో మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. అయితే.. గురువారం ఉదయమే అతను కేరళ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో వివక్ష, రాజకీయాల కారణంగానే ఉన్ని కృష్ణన్ నాయర్ మరణించినట్లు పేర్కొంటున్నారు. కాగా.. కృష్ణన్ తండ్రి ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఐఐటీ మద్రాస్ అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతోపాటు ఉన్ని కృష్ణన్ నాయర్ రాసిన 11 పేజీల సూసైడ్ నోట్ కూడా బహిర్గతం కావాల్సి ఉంది.
Also Read: