ఇంజినీర్ తెలివితో ఏటీఎంల చోరీ…చివరకు అలా ..!

|

Jul 27, 2020 | 6:19 PM

దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లలో చోరీలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, సైబర్ నెట్‌వర్క్ సాయంతో సులువుగా దొంగతనాలు చేసేస్తున్నారు. అలా ఇటీవలి కాలంలో ఏడు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను..

ఇంజినీర్ తెలివితో ఏటీఎంల చోరీ...చివరకు అలా ..!
Follow us on

దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లలో చోరీలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, సైబర్ నెట్‌వర్క్ సాయంతో సులువుగా దొంగతనాలు చేసేస్తున్నారు. అలా ఇటీవలి కాలంలో ఏడు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు …

ఏడు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు దొంగలను ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 28 ఏళ్ల వయసున్న ఓ యువ ఇంజినీర్ కూడా ఉన్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు. ఆరుగురు కలిసి అత్యంత చాకచక్యంగా చోరీలకు పాల్పడేవారని చెప్పారు. జిలాటిన్ స్టిక్స్, మోటర్‌సైకిల్ బ్యాటరీతో వారు ఏటీఎంలను పేల్చేసి డబ్బు దోచుకునేవారని వివరించారు. ఈ ఆరుగురు సభ్యుల బృందం ఇప్పటి వరకు ఏడు ఏటీఎంలను లూటీ చేసిందని వెల్లడించారు. వారి నుంచి రూ. 25.57 లక్షల నగదు, రెండు నాటు తుపాకులు, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకడైన ఇంజినీర్..గతంలో ఐఏఎస్ పరీక్షకు కూడా హాజరయ్యాడని, టీవీలలో వచ్చే క్రైమ్ సినిమాలు సీరియళ్లు చూస్తూ కొత్త కొత్త పథకాలు రచించేవాడని పోలీసులు తెలిపారు.