Loan Apps Case: లోన్ యాప్‌ల కేసులో బిగ్ అప్‌డేట్.. తాట తీస్తున్న ఈడీ.. రూ.107 కోట్లు సీజ్

|

Aug 27, 2021 | 8:32 AM

రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106.93 కోట్లు ఈడీ జప్తు...

Loan Apps Case: లోన్ యాప్‌ల కేసులో బిగ్ అప్‌డేట్.. తాట తీస్తున్న ఈడీ.. రూ.107 కోట్లు సీజ్
Loan Apps
Follow us on

రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106.93 కోట్లు ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్‌ఎస్‌.. చైనాకు చెందిన జో యాహుయ్‌ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ అధికారులు వెల్లడించారు. బోగస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, యూఎస్‌, సింగపూర్‌కు నిధులు తరలించినట్టు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్‌ఎస్‌ సొమ్ము జప్తు చేసినట్టు కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన లోన్​ యాప్​ మోసాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దృష్టి పెట్టింది. ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో.. ఆన్​లైన్​ బెట్టింగ్​స్కామ్​, లోన్​ యాప్స్ కు సంబంధాలున్నాయన్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి.  ఈ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ వేగం పెంచింది.

చైనీస్ లింకులకు సంబంధించి ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొబైల్ లింకులపై కూపీ లాగుతున్నారు పోలీసులు. గతంలోనే గూగుల్ సంస్థకు లేఖ రాశారు. గూగుల్ ప్లే స్టోర్స్‌లో వున్న 158 ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని తొలగించాలని తెలంగాణ పోలీసులు గూగుల్‌ను తమ లేఖ ద్వారా కోరారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాధితులను టెలికాలర్లు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ మొబైల్ యాప్‌ల వెనుక చైనా హస్తముందన్న కథనాల నిగ్గు తేలనున్నది.

Also Read:కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

 బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..