Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ

|

Nov 30, 2021 | 8:30 AM

ED arrests Hyderabad jeweler: హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని

Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ
Arrest
Follow us on

ED arrests Hyderabad jeweler: హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నందుకు సంజయ్‌ అగర్వాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం తెలిపింది. సంజయ్ కుమార్ అగర్వాల్ ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ షాపును నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని నగిషీల అనంతరం తిరిగి విదేశాల్లోనే అమ్మాలనే నిబంధన ఉంది. అయితే.. సంజయ్‌ మాత్రం ఇక్కడే అమ్మేవాడు. ఎలాంటి సుంకం చెల్లించకుండా ఇక్కడే విక్రయిస్తూ సంజయ్ లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. డీఆర్ఐ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా ఈడీ అధికారులు దర్యా్ప్తు ప్రారంభించారు. దీనిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయగా.. కోల్‌కతా న్యాయస్థానం గత ఏప్రిల్‌లో నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. అప్పటినుంచి సంజయ్ దొరకకుండా తిరుగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సంజయ్ పూణె సమీపంలోని లోనావాలా, అంబివ్యాలీలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకాగా.. ఈడీ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం అతన్ని కోల్‌కతా న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ఏడు రోజుల ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇదే కేసులో ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25.25 కోట్ల విలువైన 54 కిలోల బంగారం, స్థిరాస్తులు జప్తు చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.56 లక్షలను స్తంభింపజేసినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..

Charanjit Singh Channi: చిన్నారులతో కలిసి సీఎం ఎంజాయ్.. హెలికాప్టర్‌లో తిప్పిన సీఎం చన్నీ.. వీడియో