ఖరీదైన కార్లే వారి టార్గెట్.. ఏడాదిలో 25 కార్లు కొట్టేసిన కేటుగాళ్లు!.. ఎక్కడో తెలుసా?
ఖరీదైన కార్లే వారి టార్గెట్.. రోడ్డుపై ఎక్కడైన ఖరీదైన కారు వారి కంటపడిందా ఇక అంతే సంగతి. కొన్ని గంటల్లోనే దాన్ని మాయం చేయడం వారి స్పెషాలిటీ. కానీ వీళ్ల ఆటలు ఎక్కువ కాలం సాగలేదు.. ఇలానే ఓ కారును కొట్టేయడానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఈ కేటుగాళ్లు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం. ఇంతకు ఈ దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో అనే కదా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

దేశ రాజధాని ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఎస్‌యూవీ కార్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కుటుంబ సభ్యుల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ముగ్గురు సభ్యుల ముఠా కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు 20 నుంచి 25 కార్లను దొంగలించినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఢిల్లీలో నివాసం ఉంటున్న రమణ్, అతని కుమారుడు సాగర్, అల్లుడు నీరజ్ నగరంలోని విసాలవంతమైన ప్రాంతాల్లోని ఖరీదైన కార్లను దొంగలించడం టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే బయట వాళ్లతో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడితే అందరికీ తెలిసిపోతుందని.. కుటుంబంతోని సభ్యులో ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తు తేలింది.
అయితే వీరు ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా, ఫార్చ్యూనర్, మారుతి బ్రెజా వంటి ఖరీదైన ఎస్‌యూవీ కార్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరు ఎక్కవగా తెల్లవారుజామున ఈ దొంగతనాలకు పాల్పడేవారట. ఆ సమయాల్లో పార్కులు, జిమ్‌ల వద్ద పార్క్ చేసిన కార్లను అత్యాధునిక పరికరాలను ఉపయోగించి అన్‌లాక్ చేసి ఎత్తుకెళ్లేవారట. వారి వద్ద ఉన్న ప్రత్యేక సాంకేతిక పరికరాలతో కార్‌లో ఉన్న న్యావిగేషన్ వ్యవస్థతో పాటు సెక్యూరిటీ వ్యవస్థలను ఆఫ్ చేసేవారని పోలీసులు తెలిపారు.
అయితే నగరంలో వరుస కార్ల దొంగతనాలపై దృష్టి పెట్టిన ద్వారకా పోలీసులు సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. అందులో చాలా ఫుటేజ్‌లలో ఓ కారు దొంగతనానికి గురైన కార్లను ఫాలో అవ్వడం గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కార్ల వెంబడి ఫాలో అయిన కారును గుర్తించి పట్టుకున్నారు. నకిలీ నంబర్‌ప్లేట్‌తో ఉన్న ఆ కారులో వచ్చిన రమణ్, సాగర్‌లను అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. వారి వచ్చిన కారును తనిఖీ చేయగా, అందులో కార్ల దొంగతనానికి వినియోగించే పరికరాలను పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం వీరు తిరుగుతున్న కారు కూడా దొంగిలించిందేనని పోలీసుల దర్యాప్తులో తెలింది.
ఇక నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా ఏడాది కాలంతో 25 వరకు ఎస్‌యూవీ కార్లను దొంగిలించినట్లు అంగీకరించారు. దొంగిలించిన కార్లను యూపీలోని మీరట్‌లో విక్రయించినట్లు తెలిపారు. అయితే వీరిపై గతంలోనే చాలా కార్ల దొంగతనాల కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రమణ్18, సాగర్‌పై 12, నీరజ్‌పై 14 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
