Telangana: బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్

వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు ఓవరాక్షన్ చేశాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.

Telangana: బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో స్వాతిముత్యంలో కమల్ హాసన్
Drunk Man Viral Video

Edited By:

Updated on: Nov 29, 2021 | 6:00 PM

వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు ఓవరాక్షన్ చేశాడు. బ్రీత్ అనలైజర్‌లో ఊదమని ఎస్సై చెబితే సినిమాను తలపించేలా నటించేశాడు. పై పైన ఊదుతూ ఏం లేదు సార్ అంటూ బుకాయించాడు. ఎస్సై గట్టిగా ఊదమంటే ఒక్క బీరు తాగాను సార్ అంతే.. అంటూ పోలీసుల ముందు కలరింగ్ ఇచ్చాడు. ఎంతకి వినకపోవడంతో కారుతో సహా అతన్ని కూడా పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

ఇదే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరకకముందు ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి హడావిడి చేశాడు.  తన మిత్రులతో కలిసి బార్ సిబ్బందితో గొడవకు దిగారు. తింటున్న ఫుడ్ లో స్టాప్లర్ పిన్ వచ్చిందంటూ బార్ యజమానితో గొడవపడి హంగామా క్రియేట్ చేశాడు. అక్కడి సిబ్బందితో బిల్ కట్టేది లేదంటూ పరుష పదజాలం ఉపయోగించాడు. బిల్ కట్టకుండానే తన స్నేహితులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బిల్ కట్టకుండా తాగేసి.. తినేసి.. బయటకు వచ్చేశాడు కానీ…  నేరుగా వచ్చి పోలీసులకు డ్రంక్ & డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు. టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో. అతి చేస్తే.. ప్రకృతే పాఠం చెప్పింది చూశారా..!

 

Also Read:  ఊరించి, ఉసూరుమనిపించి.. తుస్సుమన్న టమాట ధర.. కేజీ 30 రూపాయలే..

 ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌