Drunk and Drive in hyderabad: హైదరాబాద్‌లో డ్రంకేశ్వరులు రెచ్చిపోతున్నారు. తాగి రోడ్లపై తిరుగుతూ.. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. నూతన సంవత్సరం రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరొకరు బలయ్యారు. బొటానికల్ గార్డెన్ ఎదుట జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితీన్ మృత్యువాతపడ్డాడు. ఐటీ ఉద్యోగి అయిన నితిన్ తెల్లవారుజామున ఎక్సర్‌సైజ్ కోసం సైకిల్ తొక్కేందుకు బయటికి వచ్చాడు. ఈ క్రమంలో కారులో మద్యం మత్తులో వస్తున్న శశాంక్.. బొటానికల్ గార్డెన్ ఎదుట నితిన్ ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నితిన్‌కు తివ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన నితిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన శశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 120 పాయింట్లు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న శశాంక్.. రాత్రి మిత్రులతో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నితిన్ తోపాటు మరో ముగ్గు స్నేహితులు సైకిల్ పై వెళుతుండగా వెనుకనుండి ఇద్దరికి ఢీకొట్టాడు. అయితే.. నితిన్‌కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Also Read: