Drugs: 1 కాదు, 2 కాదు.. ఏకంగా రూ.686 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు

|

Aug 05, 2021 | 6:30 PM

ఉత్తరప్రదేశ్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. మహరాజ్‌గంజ్‌లో 686 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోడౌన్‌లో

Drugs: 1 కాదు, 2 కాదు.. ఏకంగా రూ.686 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు
Drugs
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. మహరాజ్‌గంజ్‌లో 686 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోడౌన్‌లో డ్రగ్స్‌ను దాచిన రమేశ్‌కుమార్‌గుప్తాను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు గోవింద్‌గుప్తా కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల సాయంతో శసస్త్ర సీమా బల్‌ పోలీసులు గోడౌన్‌పై దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని డ్రగ్స్‌ను స్ధానిక మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తునట్టు గుర్తించారు. నేపాల్‌కు అక్రమంగా ఈ ముఠా మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తునట్టు గుర్తించారు. చాలా చాకచక్యంగా డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

గోడౌన్‌ నుంచి చాలా నిషేధిత పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌లో ఇంజక్షన్లతో పాటు సిరప్స్‌ , క్యాప్సూల్స్‌ , టాబ్లెట్లను కూడా సీజ్‌ చేశారు. రమేశ్‌ కుమార్‌ గుప్తాకు చెందిన ఇళ్లతో పాటు దుకాణాలలో కూడా సోదాలు చేశారు. ఇంకా ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతునట్టు అధికారులు వెల్లడించారు. మరో నిందితుడు గోవింద్‌ గుప్తా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహరాజ్‌గంజ్‌తో పాటు లక్నో , కాన్పూర్‌లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. యువత మాదకద్రవ్యాలపై వైపు ఆకర్షితులు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటునట్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.విదేశాలకు కూడా ఈ ముఠా వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఎగుమతి చేసినట్టు తెలుస్తోంది. ముంబై , గోవా, నేపాల్‌తో పాటు పాకిస్తాన్‌ , ఆఫ్గనిస్తాన్‌ డ్రగ్స్‌ స్మగ్లర్లతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పంజాబ్‌ మీదుగా ఈ ముఠా భారత్‌కు అక్రమంగా మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తునట్టు గుర్తించారు. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో ఇచ్చిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్‌ చేసి ఈ ముఠాను అరెస్ట్‌ చేశారు. కొన్ని వ్యాధులకు మందుల పేరుతో వీళ్లు అక్రమంగా డ్రగ్స్‌ను తయారు చేస్తునట్టు తెలుస్తోంది. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో ఇచ్చిన సమాచారంతో రమేశ్‌కుమార్‌ గుప్తా గోడౌన్‌పై పోలీసులు , సహస్త్ర సీమా బల్‌ బలగాలు దాడులు నిర్వహించాయి. నేపాల్‌ సరిహద్దు మీదుగానే ఈ ముఠా ఎక్కువగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తునట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో తరచుగా డ్రగ్స్‌ పట్టుబడుతున్నాయి.

Also Read: Telangana: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే

దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!