Drugs Smuggling: యువతిపై అనుమానంతో మెడికల్ టెస్టులు చేయించిన అధికారులు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!

Drugs Smuggling: పొట్టలో, మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో డ్రగ్స్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ (Coimbatore) విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.

Drugs Smuggling: యువతిపై అనుమానంతో మెడికల్ టెస్టులు చేయించిన అధికారులు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!
Drugs Smuggling

Updated on: May 10, 2022 | 6:06 PM

Drugs Smuggling: స్మగ్లింగ్ ను అరికట్టేందుకు విమానాశ్రయం సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లింగ్ మాఫియా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పొట్టలో, మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో డ్రగ్స్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ (Coimbatore) విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సినిమా స్టైల్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ యువతిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.4కోట్ల విలువైన డ్రగ్స్‌ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

షార్జా నుంచి కోయంబత్తూర్‌ విమానాశ్రయంలో దిగిన ఓ విదేశీ యువతి ప్రవర్తనపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. తనిఖీలు నిర్వహించగా ఆ యువతీ కడుపులో డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె కడుపులో రూ.4కోట్ల విలువైన డ్రగ్స్‌ క్యాప్సుల్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యువతిని అదుపులోకి తీసుకోని కస్టమ్స్ అధికారులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Sri Lanka Crisis: మహీంద రాజపక్స కుటుంబాన్ని వెంటాడుతోన్న ఆందోళన కారులు.. నేవీ స్థావరంలో  తల దాచుకున్నా..

Healthy Foods for Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Viral Video: పోలీసులపై పంజా విసిరిన చిరుత.. ప్రాణాలకు తెగించి ఎలా బంధించారో మీరే చూడండి..