విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు, డాక్టర్ నవీన్ అరెస్ట్

విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు తిరిగింది. ప్రియాంక ఆత్మహత్యకు నవీన్ కారణంగా..

విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు, డాక్టర్ నవీన్ అరెస్ట్

Updated on: Feb 16, 2021 | 10:51 AM

విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు తిరిగింది. ప్రియాంక ఆత్మహత్యకు నవీన్ కారణంగా గుర్తించిన పోలీసులు.. నిందితుడు డాక్టర్ నవీన్ ని అరెస్ట్ చేశారు. అనంతరం అతడ్ని మచిలీపట్నం సబ్ జైల్ కి తరలించగా, కోర్టు నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించింది. గత ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో సూసైడ్ నోట్ రాసి డాక్టర్ ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. నవీన్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవాడు.

విజయవాడ భవానీపురంలో నివసించే దేవీ ప్రియాంక గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవీ ప్రియాంక గుంటూరు జిల్లాలోని కాటూరు మెడికల్ కళాశాలలో పలమనాలజీలో ఎండీ సెకండ్ ఇయర్ విద్యార్థిని. ఆమె రాసిన సూసైడ్ లెటర్ ను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు నవీన్ కారణమని సూసైడ్ లెటర్ లో దేవీ ప్రియాంక రాసింది.

Read also : Job News : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు