Double Murder Case: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం లేదని అత్తను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రీషియన్ నర్సింహ దంపతులు గాంధీ నగర్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య స్వరూప పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నర్సింహ తన భార్య స్వరూప (32), అత్త ఎల్లమ్మ (55)పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో స్వరూప, ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించి పలు వివరాలను సేకరించారు.
హత్యకు గల కారణాలను సేకరిస్తున్నామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నిందితుడు నర్సింహా పోలీస్ స్టేషన్ లో లొంగి పోయినట్లు తెలుస్తోంది. అయితే.. చనిపోయిన స్వరూప ఇటీవలే విడాకులు కావాలని భర్తకు నోటీసులు పంపినట్టు సమాచారం.
Also Read: