మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపాయి. నడిరోడ్డుపై పట్టపగలే దారుణం జరిగింది. మంత్రాల నెపంతో తల్లికొడుకులను ఓ ఉన్మాది కొట్టి చంపాడు. కళ్ళు మూసి తేరిచేలోగా తల్లి కొడుకులను ఖతం చేశాడు. ఆ ఉన్మాదిని పట్టకున్న స్థానికులు కట్టేసి దేహశుద్ధి చేసి ఖాకీలకు అప్పగించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బోల్లెపల్లి గ్రామంలో జరిగింది.
తల్లి కొడుకులను నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టి చంపి కసి తీర్చుకున్నాడు ఓ ఉన్మాది. బొల్లేపల్లి గ్రామం నడిరోడ్డుపై ఈ దారుణ సంఘటన జరిగింది. తల్లి బొద్దమ్మ, కొడుకు సమ్మయ్యను ఇదే గ్రామానికి చెందిన కుమారస్వామి అనే ఉన్మాది అతి దారుణంగా కొట్టి చంపాడు. అయితే కొద్ది రోజుల నుండి కుమారస్వామి ఇంట్లో ఎవరీకీ ఆరోగ్యాలు బాగాలేక పోవడంతో ఈ తల్లి కొడుకులే కారణమని, వాళ్ళు చేతబడి చేస్తున్నారని అనుమానం పెంచుకున్నాడు. వాళ్ళని హతమార్చడానికి రెక్కీ నిర్వహించారని స్థానికులు చెప్తున్నారు. వారికి ప్రాణభయం ఉందని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదని స్థానికులు ఆరోపించారు.
ఈ క్రమంలోనే అదును కోసం వేచి చూసిన ఆ ఉన్మాది అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. తల్లి కొడుకులను నడిరోడ్డుపై బలి తీసుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఇనుపరాడ్డుతో తల్లి కొడుకులను కొట్టి చంపాడు. కళ్ళు మూసి తెలిసేలోపే తల్లికొడుకులను ఖతం చేశాడు ఆ కిరాతకుడు. చంపి పారిపోతుండుగా ఆ ఉన్మాది ని పట్టుకుని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…