కొమురంభీమ్ సిర్పూర్‌లోని ఎంపీడీవోపై గృహ హింస కేసు నమోదైంది. ఎంపీడీవో జగదీష్‌పై కాగజ్‌నగర్ పీఎస్‌లో భార్య మేరీకుమారి ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తేవాలంటూ తనను శారీరకంగా హింస్తున్నట్లు పేర్కొంది మేరి. కత్తితో చేతులపై గాట్లు పెడుతూ నరకానికి గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన మేరీకుమారితో జగదీష్‌కి 2018లో వివాహమైంది. అయితే, ఉద్యోగ రీత్యా వీరు కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీన రాత్రి తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తన భర్త జగదీశ్ అదనపు కట్నం తేవాలంటూ గొడవ పడ్డాడని, కత్తితో దాడి చేసి చేతులు, వీపు భాగంలో గాయపర్చాడంటూ బాధితురాలు గోడు వెల్లబోసుకుంది.. గతంలోనూ ఇదే తరహాలో తనపై హత్యాయత్నం జరిగిందని, ఇప్పటికైన తన భర్తకు తగిన బుద్ది చెప్పి, తనకు న్యాయం చేయాలంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.
జిల్లాలోని సిర్పూర్(టి) ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ అనిల్‌కుమార్‌పై అతని భార్య మేరీ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఎస్పీ మల్లారెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. జగదీశ్ అనిల్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. కాగా.. పోలీసులు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్‌పై గృహ హింస, వరకట్నం కింద కేసులు నమోదు చేశారు. దీంతో.. ఎంపీడీవో ఊరి నుంచి జగదీష్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.