Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ (DMK) కుమారుడు రాకేష్‌ (22) మృతి చెందాడు.

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..
Accident

Updated on: Mar 10, 2022 | 2:31 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ (DMK) కుమారుడు రాకేష్‌ (22) మృతి చెందాడు. డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు రాకేష్‌ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్‌ను డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పుదుచ్చెరి నుంచి చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, న్యాయవాది అయిన ఇళంగోవన్‌ (NR Elangovan) 2020 నుంచి డీఎంకే పార్టీ తరపున రాజ్యసభలో ప్రతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్‌ మరణవార్త తెలియడంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా పలువురు పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:

Telangana: వామ్మో.. ఇదేం స్కామ్‌రా నాయనా..! రూ.కోటి 62 లక్షలు నొక్కేసిన సబ్ పోస్ట్ మాస్టర్.. సీబీఐ కేసు

Crime News: ఆత్మహత్యే శరణ్యమనుకుంది.. ఒంటిపై పెట్రోల్​పోసుకుని నిప్పంటించుకుంది