Mansas Trust: ఆడిటింగ్ జరగకుండానే ఫీజుల చెల్లింపులు.. మాన్సస్ సంస్థ లెక్కలు తేల్చేందుకు కదలిన యంత్రాంగం

మాన్సాస్ సంస్థ ఆడిట్ అంశంపై గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదాన్ని చక్కదిద్దేందుకు ట్రస్ట్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాన్సస్ కార్యాలయానికి చేరుకున్న జిల్లా ఆడిట్ అధికారులు.

Mansas Trust: ఆడిటింగ్ జరగకుండానే ఫీజుల చెల్లింపులు.. మాన్సస్ సంస్థ లెక్కలు తేల్చేందుకు కదలిన యంత్రాంగం
District Audit Officers Reached To Mansas Trust Office

Updated on: Jul 05, 2021 | 12:01 PM

Mansas Trust Auditing: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ పై వివరణ కోరారు. మాన్సాస్ సంస్థ నుంచి చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై ఈనెల 21లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ట్రస్ట్ పరిధిలోని విద్యా సంస్థల బడ్జెట్ పై వారం రోజుల్లో ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 5లక్షలు పైబడిన కొనుగోళ్లపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మాన్సాస్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని అశోక్ గజపతి రాజు ఆదేశించారు. ఆడిట్ అంశం పై గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదాన్ని చక్కదిద్దేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాన్సస్ కార్యాలయానికి చేరుకున్న జిల్లా ఆడిట్ అధికారి డా. హిమబిందు.. మాన్సస్ రికార్డ్స్‌ను ఆడిట్ చేసేందుకు అధికారులతో కలిసి సిద్ధమయ్యారు.

మాన్సస్ ఆడిట్ 2004-05 నుంచి జరగాల్సి ఉంది.. ఆడిట్‌కు సంబంధించి మాన్సస్ మొత్తం రికార్డ్స్‌ను ట్రస్ట్ అధికారులను ఆడిగామని జిల్లా ఆడిట్ అధికారి డా.హిమబిందు తెలిపారు. రికార్డ్స్‌ను పూర్తిగా తమకి అప్పగిస్తే తప్పా ఆడిట్ చేయలేమన్నారు. ప్రస్తుతానికి కొన్ని హర్డు కాపీలను మాత్రమే మాకు అందజేశారన్నారు. పూర్తి స్థాయిలో రికార్డ్స్ అందాల్సి ఉందన్నారు. మిగిలిన రికార్డ్స్ కోసం మాన్సస్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని హిమబిందు పేర్కొన్నారు.

ఇదిలావుంటే, దేవాదాయశాఖకు సంబంధించి ఆడిట్ కోసం ముందస్తుగా ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ చెల్లింపులకు సంబంధించి వివరాు ఆడిట్ చేస్తే కానీ తెలియదన్నారు. మాన్సస్ లో ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత ట్రస్ట్ అధికారులదేనన్న ఆమె.. ప్రతీ ఏడాది ఆడిట్ కోసం ట్రస్ట్‌కు లేఖ రాయడం తమ విధి అన్నారు. మాన్సాస్ సంస్థకు సంబంధించి నిష్పక్షపాతంగా నివేదిక రూపొందిస్తామన్నారు.

Read Also… Srisailam Temple: డ్రోన్లు ఇలా చక్కర్లు కొట్టి అలా మాయం అవుతున్నాయి.. శ్రీశైలంలో అసలేం జరుగుతోంది?..