
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ షాకింగ్ సీన్ ఉంటుంది. తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో హీరోయిన్ ఫాదర్ హీరో మర్మాంగాన్ని కోయిస్తాడు. సినిమాను పోలిన ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది . తమ ఇంటి అమ్మాయిని లవ్ చేసి, మ్యారేజ్ చేసుకున్నాడని.. కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు.. యువకుడిపై దారుణంగా దాడి చేశారు. అతడిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, మర్మాంగాన్ని కోసేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు లవ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దల్ని ఆశ్రయించారు. కానీ అందుకు యువతి కుటుంబ సభ్యులు నో చెప్పారు. దాంతో విడిపోయి బ్రతకలేమని నిర్ధారించుకుని.. ఇంట్లో నుంచి వెళ్లి, ఢిల్లీ బయట వివాహం చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు వారిపై కక్షగట్టారు. అదును కోసం వెయిట్ చేశారు. పెళ్లి తర్వాత ఆ జంట.. డిసెంబరు 22న తిరిగి ఢిల్లీకి చేరుకుంది. కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాజౌరీ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు…పీఎస్ నుంచి యువకుడు బయటకు రాగానే.. రాజౌరీ గార్డెన్ ఏరియాలో అతడ్ని కిడ్నాప్ చేశారు. తీవ్రంగా కొట్టారు. అతని మర్మాంగాన్ని కోసేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అతడు ప్రస్తుతం సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు