నకిలీ రైల్వే అధికారులకు పోలీసులు చెక్

| Edited By:

Aug 16, 2020 | 11:33 AM

ఢిల్లీలో ఇద్దరు నకిలీ రైల్వే అధికారులకు పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే..

నకిలీ రైల్వే అధికారులకు పోలీసులు చెక్
Follow us on

ఢిల్లీలో ఇద్దరు నకిలీ రైల్వే అధికారులకు పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో ప్రయాణికుల టికెట్లు, సిబ్బంది గుర్తింపు కార్డులను చెక్ చేశారు. ఈ క్రమంలో గోల్డెన్‌ టెంపుల్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఎక్కేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమను తాము రైల్వే ఆఫీసర్‌లుగా పోలీసులకు పరిచయం చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో వీరిద్దరు ఫేక్‌ ఆఫీసర్లు అని తేలింది. అయితే వీరిలొ ఒకరు రైల్వే సైబర్‌ కేఫ్‌లో పనిచేసిన వ్యక్తిగా గుర్తించారు. వీరు దూర ప్రయాణాలు చేసేందుకు ఫేక్ ఐడీ కార్డులను సృష్టించి రైల్వే ఉద్యోగులుగా ప్రవర్తిస్తుంటారని తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు