Delhi Fire Accident: అగ్ని ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. నిర్లక్ష్యం కారణంగా జరిగిన అగ్ని ప్రమాదాల కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 20 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆటంకం ఏర్పడిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
నెబ్ సరాయ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఢిల్లీలో ఇలాంటి అగ్ని ప్రమాదంలో ఇటీవల ఎన్నో జరిగాయి. షాట్ సర్య్కూట్, ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది.
Also Read: