Crime News: పెళ్లి కాకముందే ప్రసవం.. నిమిషాల్లోనే తల్లీ, బిడ్డ మృతి.. తండ్రి కోసం పోలీసుల వేట..

| Edited By: Anil kumar poka

Sep 16, 2021 | 8:45 AM

Unmarried Lady delivery: పెళ్లి కాకముందే ఓ యువతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. అయితే.. నిమిషాల్లోనే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు.. ఆ తర్వాత ప్రేమ వ్యవహారం

Crime News: పెళ్లి కాకముందే ప్రసవం.. నిమిషాల్లోనే తల్లీ, బిడ్డ మృతి.. తండ్రి కోసం పోలీసుల వేట..
Unmarried Lady Delivery
Follow us on

Unmarried Lady delivery: పెళ్లి కాకముందే ఓ యువతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. అయితే.. నిమిషాల్లోనే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు.. ఆ తర్వాత ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ పరిధిలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అనంతరం యువతి ప్రేమ వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు సైతం షాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిచెందిన యువతిది ఉప్పరకేరి పరిధిలోని కుమ్సీ గ్రామ నివాసి. ఆమె అయనూరులో చదువుతున్నప్పుడు పొరుగు గ్రామానికి చెందిన మధుసూదన్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం మైసూరుకు వెళ్లింది. మైసూరులో ఉన్నప్పుడు.. యువతి బసవరాజ్‌ అనే వ్యక్తికి దగ్గరైంది. అతనితో ప్రేమలో పడింది. కరోనా లాక్డౌన్ కారణంగా.. యువతి తన గ్రామం కుమ్సీకి వచ్చేటప్పుడు.. బసవరాజ్‌ని కూడా తీసుకువచ్చింది.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. తన స్నేహితుడని లాక్డౌన్ కారణంగా ఇక్కడికి వచ్చాడంటూ పేర్కొంది. అయితే… కుటుంబసభ్యులకు మరింత అనుమానం రావడంతో బసవరాజ్ మళ్లీ మైసూరుకు వెళ్లాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత యువతి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో పలు ఆసుపత్రులకు వెళ్లింది. శరీరంలో మార్పులు గమనించి తల్లిదండ్రులు ప్రశ్నించగా.. గ్యాస్ట్రిక్ సమస్య అంటూ దాటవేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 12 న యువతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే.. ఆమెను తల్లిదండ్రులు మెక్‌గాన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అని తెలిసింది. అక్కడ యువతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన వెంటనే బిడ్డ చనిపోగా.. అధిక రక్తస్రావం కారణంగా ఆయువతి కూడా రెండు గంటల్లోనే కన్నుమూసిందని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న కుమ్సీ పోలీసులు.. ఆమె గర్భధారణకు ఎవరు బాధ్యులు అని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్‌, బసవరాజ్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తల్లి, బిడ్డ రక్త నమూనాలను బెంగళూరులోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపారు. అయితే.. చట్టపరమైన సమస్యలు తలెత్తితే.. డిఎన్‌ఎ పరీక్ష ద్వారా తండ్రి ఎవరన్నది తేల్చాలని పోలీసులు యోచిస్తున్నారు.

Also Read:

Nirbhaya Act: ‘నిర్భయ’ చట్టానికి పదేళ్లు.. అయినా మహిళను వదలని భయం.. మగువకు రక్షణ ఇంకెప్పుడు..?

Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?